గద్దర్ అవార్డుల వేడుకకు సన్నాహాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జూన్ 14న హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది.;
కొంతకాలం విరామం తర్వాత, తెలుగు చిత్రసీమ ప్రతిభను గౌరవించే కార్యక్రమం మరోసారి ప్రారంభమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జూన్ 14న హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది.
2024లో విడుదలైన చిత్రాలతో పాటు, 2014 జూన్ నుండి 2024 డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తిచేసుకున్న చిత్రాల్లో ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి అవార్డుల జాబితా ఇటీవలే ప్రకటించారు. ఈ అవార్డుల ద్వారా ప్రభుత్వం అందించిన గుర్తింపుపై సినీ ప్రముఖులు ఇప్పటికే తమ ఆనందం వ్యక్తం చేశారు.
గద్దర్ అవార్డుల వేదికగా మారుతున్న హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణం ఇప్పటికే ప్రత్యేకంగా అలంకరణతో సిద్ధమవుతోంది. ఈ వేడుకను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి.