స్థానిక సంస్థల ఎన్నికలకు పది రోజులు చాలు: సీఎం రేవంత్
ముస్లిం, బీసీ వర్గాల హక్కులకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ హామీ;
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పది రోజుల సమయం సరిపోతుంది అని, కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మా ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరు అన్నారు. ప్రజల హక్కుల కోసం సాగుతున్న మా పోరాటం కేంద్ర ప్రభుత్వంపైనే, బీసీలకు 42% రిజర్వేషన్ సాధించేదాకా వదిలేదు అన్నారు. అందుకే జంతర్ మంతర్ వద్ద మా గొంతు వినిపించాల్సిన అవసరం ఏర్పడింది అని సీఎం పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను బట్టి సవరించిన ముసాయిదాను గవర్నర్‌కు పంపించినట్టుగా తెలియచేసారు. ఈ బిల్లును తాము పూర్తిస్థాయిలో చట్టపరమైన విధంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము అని రేవంత్ వివరించారు.
బీసీ రిజర్వేషన్లపై తుదినిర్ణయం ప్రధానమంత్రి మోదీ చేతుల్లోనే ఉందని స్పష్టంగా చెప్పగలం అన్నారు. అయితే, రాజ్యాగం ప్రకారం రాష్ట్రపతి గారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ, ఇప్పుడు పరిస్థితి చూస్తే వేరేలా ఉంది రాష్ట్రపతి నిర్ణయాలు కూడా మోదీ ఆదేశాలకే లోబడి జరుగుతున్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి సమాధానం ఇవ్వాల్సింది మోదీనే," అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు.