వైద్య రంగంలో విదేశీయులను అక్షరశిస్తున్న భారతదేశం

వీసా సౌలభ్యం, డిజిటల్ సదుపాయాలు విదేశీయులకు విశ్వాసాన్ని పెంచాయి;

Update: 2025-08-08 09:09 GMT

భారతదేశం వైద్య రంగంలో తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది. 2025 జనవరి నుండి ఏప్రిల్ వరకు, వైద్య చికిత్సల కోసం భారత్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 1.31 లక్షలకు పైగా నమోదు కావడం ఈ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో స్పష్టంగా చూపిస్తోంది. ఇది మొత్తం విదేశీ పర్యాటకుల్లో సుమారుగా 4.1 శాతంగా నమోదు అయింది, అంటే ప్రతి 25 మందిలో ఒకరు వైద్య సంబంధిత కారణాల కోసం భారతదేశాన్ని సందర్శిస్తున్నారు.

భారతదేశం వైద్య సేవల్లో అత్యుత్తమ నాణ్యతను, అత్యంత చౌకధరల్లో అందిస్తోంది. అధునాతన శస్త్రచికిత్సలు, క్యాన్సర్, కార్డియో, న్యూరో చికిత్సలు, వృద్ధాప్య సంరక్షణ, సంరక్షణాత్మక ఆరోగ్య సేవలతో పాటు ఆయుర్వేదం, యోగా, సిద్ధ, వంటి ఇక్కడ సంప్రదాయ వైద్య విధానాలు కూడా ఉండటం వలన భారత దేశం వైద్య రంగంలో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, ఇరాక్, సోమాలియా, ఓమన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల నుంచి వచ్చిన పేషెంట్ల సంఖ్య గణనీయంగా పేగుతుంది.

భారత ప్రభుత్వం ప్రారంభించిన "హీల్ ఇన్ ఇండియా" కార్యక్రమం ఈ రంగ అభివృద్ధికి ఊతమిచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా e‑Medical Visa, Ayush Visa, మెడికల్ అటెండెంట్ వీసా వంటి వీసా విధానాలు సులభతరం చేయబడ్డాయి. అలాగే e‑Sanjeevani టెలీమెడిసిన్ సేవలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆసుపత్రులు, వైద్య సేవలపై కేంద్రీకృత డిజిటల్ పోర్టల్‌లు అందుబాటులోకి రావడం వల్ల విదేశీయుల నమ్మకాన్ని భారత వైద్య వ్యవస్థపై పెంచాయి.

KPMG నివేదిక ప్రకారం, భారత వైద్య పర్యటన రంగం 2025 నాటికి USD 18.2 బిలియన్లు విలువ చేసే మార్కెట్‌గా ఉన్నట్టు,ఇది 2035 నాటికి USD 58.2 బిలియన్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నట్టు భావిస్తుంది. ఈ సంవత్సరానికి సగటున 12.3% వృద్ధిరేటుతో అభివృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 1,700 కంటే ఎక్కువ NABH-అధికారపరచిన ఆసుపత్రులు, 63+ JCI-మాన్యతలు పొందిన సంస్థలు దేశంలో ఉన్నాయి.

సరసమైన ఖర్చులు, అత్యున్నత వైద్య నిపుణులు, టెక్నాలజీ ఆధారిత చికిత్సలు, సాంప్రదాయ చికిత్సల విలువ, ప్రభుత్వ మద్దతు వంటి అంశాల సమ్మేళనమే భారతదేశాన్ని వైద్య పర్యటనకు ప్రపంచ కేంద్రంగా మార్చుతోంది. ఈ వేగవంతమైన అభివృద్ధిని బట్టి చూస్తే, త్వరలోనే భారత్ ప్రపంచ వైద్య పర్యటనలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ఖాయంలా కనిపిస్తుంది.

Tags:    

Similar News