ఓటీటీలోకి వచ్చేసిన 'మిరాయ్'
‘హనుమాన్’తో నేషన్ వైడ్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ 'మిరాయ్'తో మరో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది.;
‘హనుమాన్’తో నేషన్ వైడ్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ 'మిరాయ్'తో మరో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుని, రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
థియేటర్స్‌లో రికార్డ్ వసూళ్లు సాధించిన 'మిరాయ్' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఈరోజు (అక్టోబర్ 10) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. అశోకుడి కాలం నాటి తొమ్మిది పవిత్ర గ్రంథాలను చుట్టూ తిరుగుతుంది. తేజ సజ్జ పోషించిన వేద ప్రజాపతి, తాంత్రిక శక్తులలో నిష్ణాతుడైన బ్లాక్ స్వార్డ్ (మంచు మనోజ్)కి ఎదురు నిలబడి తన లక్ష్యాన్ని సాధించే ప్రయాణం ఈ సినిమా కథాంశం.
రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం కీలక పాత్రల్లో మెరిశారు. ముఖ్యంగా మంచు మనోజ్ విలన్‌గా ఇచ్చిన ఇంపాక్ట్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. టెక్నికల్‌గా కూడా ‘మిరాయ్’ ఓ విజువల్ ఫీస్ట్. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్, గౌరహరి సంగీతం, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ ఇవన్నీ కలిపి సినిమా అనుభూతిని మరింత గ్రాండ్యుయర్ గా చేశాయి. థియేటర్‌లో మిస్ అయిన వాళ్లందరికీ ఇప్పుడు ‘మిరాయ్’ను హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో చూడొచ్చు.