‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రెడీ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా పి.మహేష్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-10-10 11:22 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా పి.మహేష్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. కీలక పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా‘ నుంచి టీజర్ రాబోతుంది. అక్టోబర్ 12న ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

కాస్త గ్యాప్ తర్వాత రామ్ నుంచి రాబోతున్న ఫుల్ లెన్త్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమాకి వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘నువ్వుంటే చాలే‘ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ పాటను అనిరుధ్ పాడగా, రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. ఆ తర్వాత రిలీజైన ‘పప్పీ షేమ్‘ సాంగ్ ను స్వయంగా రామ్ పాడటం విశేషం. మొత్తంగా.. రామ్ యాక్టర్ గానే కాకుండా సింగర్, లిరిసిస్ట్ గానూ ‘ఆంధ్రా కింగ్ తాలూకా‘తో తన సత్తా చాటబోతున్నాడు. నవంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Tags:    

Similar News