మంచు లక్ష్మి – జర్నలిస్టు వివాదానికి ముగింపు!
నటి, నిర్మాత మంచు లక్ష్మి సినిమా ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఒక సీనియర్ జర్నలిస్టు ఆమె వయసు, దుస్తులపై చేసిన అనుచిత ప్రశ్న పెద్ద వివాదంగా మారింది.;
నటి, నిర్మాత మంచు లక్ష్మి సినిమా ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఒక సీనియర్ జర్నలిస్టు ఆమె వయసు, దుస్తులపై చేసిన అనుచిత ప్రశ్న పెద్ద వివాదంగా మారింది. 'మహేశ్‌బాబుకు కూడా 50 ఏళ్లు వస్తున్నాయి... ఆయనను కూడా ఇలాగే అడుగుతారా?' అంటూ లక్ష్మి ఘాటుగా స్పందించి తన గౌరవాన్ని కాపాడుకున్నారు.
దీంతో ఆ జర్నలిస్టుపై ఆమె ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. 'క్షమాపణ చెప్పేంతవరకు వదిలిపెట్టను' అని ఆమె స్పష్టంగా ప్రకటించారు. చివరికి మూడు వారాల తర్వాత సదరు జర్నలిస్టు బేషరతుగా క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశారు. 'నా ప్రశ్న వల్ల మీకు బాధ కలిగిందని తెలిసింది, ఈ వివాదం ఇక్కడితో ముగియాలి' అని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిణామంపై మంచు లక్ష్మి స్పందిస్తూ, 'ఒక క్షమాపణ కోసం నాకు మూడు వారాలు పట్టింది. నేను మౌనంగా ఉండకపోవడం వల్లే ఈ రోజు ప్రతి మహిళ గొంతు వినిపిస్తుంది. నా కోసం నేను నిలబడ్డాను అదే నన్ను ముందుకు నడిపే బలం. జర్నలిజం ఒక గౌరవప్రద వృత్తి, కానీ ఆ శక్తిని వ్యక్తిగత దాడుల కోసం వాడితే బాధాకరం' అంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు.