‘కిష్కింధపురి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సెప్టెంబర్ నెలలో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో ‘కిష్కింధపురి‘ ఒకటి. యాక్షన్ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ ఏడాది ‘భైరవం‘ తర్వాత దక్కిన మరొక హిట్ ‘కిష్కింధపురి‘.;
By : S D R
Update: 2025-10-10 10:27 GMT
సెప్టెంబర్ నెలలో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో ‘కిష్కింధపురి‘ ఒకటి. యాక్షన్ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ ఏడాది ‘భైరవం‘ తర్వాత దక్కిన మరొక హిట్ ‘కిష్కింధపురి‘. బెల్లంకొండ, అనుపమ జంటగా హారర్ బ్యాక్ డ్రాప్ లో కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదలైంది.
థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించిన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతోంది. అక్టోబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి ZEE5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ గా దుమ్మురేపిన ‘కిష్కింధపురి‘ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.