పంచ్‌లు పేల్చిన ‘ఫంకీ‘ టీజర్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫంకీ’. హిలేరియస్ ఎంటర్టైనర్స్‌లో దిట్ట అయిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.;
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫంకీ’. హిలేరియస్ ఎంటర్టైనర్స్‌లో దిట్ట అయిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వక్ సేన్ ఎనర్జీ, అనుదీప్ హ్యూమర్ టచ్ తో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టే లేటెస్ట్ గా రిలీజైన టీజర్ ఆకట్టుకుంటుంది.
టీజర్ ఆద్యంతం అనుదీప్ మార్క్ కామెడీ పంచెస్ తో నిండిపోయింది. ఇప్పటివరకూ సీరియస్ యాక్షన్ మూవీస్ లో అదరగొట్టిన విశ్వక్ సేన్.. ఈ సినిమాలో ఓ మూవీ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కయాదు లోహార్ హీరోయిన్ గా నటిస్తుంది. నరేష్, వి.టి.వి. గణేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ టెక్నికల్ గా ‘ఫంకీ‘కి మరో అసెట్. మొత్తంగా.. ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా విశ్వక్ సేన్ ‘ఫంకీ‘ రెడీ అవుతుంది.