‘మీసాల పిల్ల’.. ఫుల్ సాంగ్‌ వస్తోంది!

మెగా మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు‘ నుంచి ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల‘ సాంగ్ ప్రోమో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.;

By :  S D R
Update: 2025-10-10 12:05 GMT

మెగా మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు‘ నుంచి ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల‘ సాంగ్ ప్రోమో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మెగాస్టార్ మార్క్ మెస్మరైజింగ్ స్టెప్పులతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ఫుల్ లిరికల్ ఎప్పుడెప్పుడు వస్తోందా? అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. లేటెస్ట్ గా ఆ మెగా అప్డేట్ వచ్చేసింది.

సినిమా తీయడం ఒకెత్తయితే.. ఆ చిత్రాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. ఇక.. తన సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తానే భుజానికెత్తుకుంటాడు అనిల్ రావిపూడి. ‘మీసాల పిల్ల‘ సాంగ్ ప్రోమోని తన ప్రచారంతో ఎంతో హైలైట్ చేసిన అనిల్.. లేటెస్ట్ గా ఈ మూవీ ఫుల్ సాంగ్ అనౌన్స్ మెంట్ కోసం ఓ సరికొత్త వీడియోని సృష్టించాడు.

‘సంక్రాంతికి వస్తున్నాం‘లో బుల్లిరాజుగా అదరగొట్టిన రేవంత్.. ‘మన శంకరవరప్రసాద్ గారు‘లోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ బుల్లిరాజుతోనే ‘మీసాల పిల్ల‘ ఫుల్ సాంగ్ అనౌన్స్ మెంట్ ను వైవిధ్యంగా చేయించారు. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అక్టోబర్ 13న విడుదలకాబోతుంది. సంక్రాంతి బరిలో సినిమా థియేటర్లలోకి వస్తోంది.



Tags:    

Similar News