బన్నీకి జోడీగా జాన్వీ

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ వరల్డ్ రేంజులో రాబోతున్న మూవీ అల్లు అర్జున్-అట్లీ కాంబో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కలయికలో ఈ సినిమా రూపొందుతుంది.;

By :  S D R
Update: 2025-04-15 11:47 GMT

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ వరల్డ్ రేంజులో రాబోతున్న మూవీ అల్లు అర్జున్-అట్లీ కాంబో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కలయికలో ఈ సినిమా రూపొందుతుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట.

ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి పలు ఆసక్తికర విశేషాలు బయటకు వచ్చాయి. లేటెస్ట్ గా ఈ మూవీ హీరోయిన్ గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఈ సినిమాకోసం అట్లీ సంప్రదించాడట. ఇప్పటికే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం జాన్వీకి అడ్వాన్స్ కూడా ఇచ్చిందట సన్ పిక్చర్స్.

తెలుగులో ఎన్టీఆర్ తో ‘దేవర‘లో నటించిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘పెద్ది‘లో జోడీ కడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా నటిస్తే.. వరుసగా టాలీవుడ్ లోని టాప్ హీరోలను కవర్ చేసినట్టు అవుతుంది. మొత్తంగా వరల్డ్ క్లాస్ లెవెల్‌లో రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ హీరోగా బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్‌, అట్లీ మాస్ యాక్షన్‌ నెరేషన్‌కి తోడు జాన్వీ కపూర్ గ్లామర్ కూడా కలిస్తే.. ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింతగా పెరిగినట్టే.

Tags:    

Similar News