విఫా తుఫాన్ ప్రభావం: ఏపీలో భారీ వర్షాలు
హాంకాంగ్, దక్షిణ కొరియాలో విఫా తుఫాన్ వల్ల భారీ నష్టం - మత్స్యకారులు, రైతులకు అప్రమత్తం;
వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం, ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అల్పపీడనం విఫా తుఫాన్ ప్రభావంతో ఏర్పడింది, ఇది చైనా మరియు హాంకాంగ్ లో విపరీతమైన పతనం సృష్టించి, బంగాళాఖాతంలోకి ప్రవేశించింది.
విఫా తుఫాన్ చైనా మరియు హాంకాంగ్ ప్రాంతాల్లో భారీ ధ్వంసం సృష్టించింది. గంటకు 150 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. హాంకాంగ్‌లో 400 విమానాలు రద్దయ్యాయి, మరియు దక్షిణ కొరియాలో 17 మంది మరణించారు. ఫిలిప్పీన్స్ లో 370,000 మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.
వాతావరణ శాఖ పేర్కొన్నట్లు, రాబోయే మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వర్గాల్లో గంటకు 60 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
మత్స్యకారులు మరియు రైతులను అప్రమత్తం ఉండాలి అని తెలియచేసింది వాతావరణశాఖ. ఈ సమయంలో సముద్రం మీదకు ఎవ్వర్ని వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించింది మరియు సముద్ర తీరప్రాంత ప్రజలు అందరూ ప్రత్యమానయా ఎర్పాట్లకు సిద్దంగా ఉండాలి అని తెలియచేసింది.
ఇటీవలి వాతావరణ మార్పుల ప్రభావంగా, ప్రజలు ఎటువంటి అవాంఛనీయ పరిస్థితుల్లో ఉండకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి పర్యవేక్షించేందుకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ తుఫాన్ చైనా, హాంకాంగ్ లో పెద్ద ఆపదలు తెచ్చింది. భవనాలు పగలడంతో వందలాది ప్రజలు నష్టం కలిగారు. దక్షిణ కొరియాలో 17 మంది మరణించారు, మరియు 400 పైగా భవనాలు ధ్వంసమయ్యాయి.
ఈ విపరీత వాతావరణ పరిస్థితులు ప్రజలు అప్రమత్తంగా ఉండటం ఎంతయినా అవసరం అని,అల్పపీడనం తీవ్రతరం అవ్వకముందే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.