రాజమౌళికి బర్త్ డే విషెస్

టాలీవుడ్‌ను ప్రపంచ పటంలో నిలిపిన పేరు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. ‘శాంతి నివాసం’ సీరియల్‌తో దర్శకుడిగా ప్రారంభమైన రాజమౌళి, ‘స్టూడెంట్ నం.1’తో సినీ రంగంలో అడుగుపెట్టిన క్షణం నుంచే తన దృష్టి, తన పట్టు ఏ స్థాయిలో ఉంటుందో చూపించాడు.;

By :  S D R
Update: 2025-10-10 08:05 GMT

టాలీవుడ్‌ను ప్రపంచ పటంలో నిలిపిన పేరు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. ‘శాంతి నివాసం’ సీరియల్‌తో దర్శకుడిగా ప్రారంభమైన రాజమౌళి, ‘స్టూడెంట్ నం.1’తో సినీ రంగంలో అడుగుపెట్టిన క్షణం నుంచే తన దృష్టి, తన పట్టు ఏ స్థాయిలో ఉంటుందో చూపించాడు. ‘సింహాద్రి’ నుంచి ‘మగధీర’, ‘ఈగ’ నుంచి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వరకు ప్రతి చిత్రం కొత్తదనానికి ప్రతీక.

హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలో, కథే హీరో అన్న దృఢ నమ్మకంతో ముందుకు సాగిన జక్కన్న, తన క్రియేటివిటీతో టాలీవుడ్‌కి గ్లోబల్‌ గుర్తింపు తీసుకొచ్చాడు. ‘బాహుబలి’ సిరీస్‌తో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలియజేసి, ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ వేదిక దాకా చేర్చాడు.

ఈరోజు (అక్టోబర్ 10) రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా హ్యాపీ బర్త్ డే రాజమౌళి హ్యాష్ ట్యాగ్స్ తో నిండిపోయింది. రాజమౌళి పనిచేస్తున్న మహేష్ బాబు, పనిచేసిన ఎన్టీఆర్‌, రామ్ చరణ్ వంటి స్టార్స్ తో పాటు.. పలువురు సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలు జక్కన్నకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిజేస్తున్నారు.



Tags:    

Similar News