వైఎస్ జగన్ లండన్ పర్యటన
By : Surendra Nalamati
Update: 2025-01-15 11:56 GMT
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 16న ఆయన చిన్న కుమార్తె వర్ష డిగ్రీ కాన్వకేషన్ సందర్భంగా లండన్ చేరుకున్నారు. ఆయన భార్య వైఎస్ భారతితో కలిసి ఈ పర్యటనలో పాల్గొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్నందున, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదన్న షరతు ఉంది. అయితే తన కుమార్తె కాన్వకేషన్‌లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి కోరగా, ఇటీవల సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన 30వ తేదీ వరకు లండన్‌లో ఉండేందుకు అనుమతి పొందారు.