తెలంగాణ బీజేపీలో నూతన అధ్యక్షుడి ఎంపికపై స్పష్టత ఇవాళే

రాంచందర్ vs ఈటల - రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో ఉత్కంఠత ముగింపు దశలో;

Update: 2025-06-30 07:59 GMT

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి తుది రేసులో పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు, మరియు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు నిలిచాయి. కేంద్ర బీజేపీ హైకమాండ్ ఈ రెండు పేర్ల పైన సమగ్రంగా సమీక్షించి, చివరికి రాంచందర్ రావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

పార్టీ అధిష్టానం నుంచి సంబంధిత రాష్ట్ర నాయకులకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేతలు, సంఘ్ ప్రముఖుల సూచనల మేరకు రాంచందర్ రావు వైపు పార్టీ మొగ్గు చూపిందని విశ్వసనీయ సమాచారం. అయితే, ఈటల రాజేందర్ పేరు కూడా తుది జాబితాలో ఉండడం గమనార్హం. ఇక బీసీ వర్గానికి చెందిన ఎంపీకి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ బీసీ నినాదం మీదే తన రాజకీయ వ్యూహాన్ని నిర్మించుకుంటోంది.

ఈ నేపథ్యంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ,నేడు నేను నామినేషన్ వేయబోతున్నట్టు తెలిపారు,,కానీ ఇంకా అధిష్టానం నుంచి అధికారిక సమాచారం నాకు అందలేదు. అధికార ప్రకటన వెలువడేంతవరకూ పార్టీ మార్గదర్శకాలను అనుసరిస్తాను. అని అన్నారు.

బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది.ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.

ఈ ఎన్నికల తతంగాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ ఆదివారం సీనియర్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్రం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, పార్టీలో అధిక వర్గాలు రాంచందర్ రావును అధ్యక్షుడిగా అంగీకరించినట్లు సమాచారం.

Tags:    

Similar News