పర్యటనలకు వెళ్లి ప్రాణాలు తీస్తున్న జగన్" – లోకేష్ ఆగ్రహం
164 మంది టీడీపీ కార్యకర్తల హత్యలకు జగన్ కుటుంబమే బాధ్యతవహించాలి" – లోకేష్ వ్యాఖ్యలు;
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బీజేపీ-టీడీపీ కూటమి తరఫున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గంలోని అనిల్ గార్డెన్స్ లో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన ఆయన మాట్లాడుతూ –మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ హెలికాప్టర్లలో తిరుగుతూ, జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో పరామర్శకు వెళ్లి ముగ్గురి ప్రాణాలు తీసేలా చేసారు. ఒకరు కారు కింద పడి చనిపోయారు, మరొకరు ఊపిరాడక మృతిచెందారు, మూడో వ్యక్తి అంబులెన్స్‌లో చిక్కుకుని మరణించారు. ఇదేనా నాయకత్వం? అని ప్రశ్నించారు నారా లోకేష్.
జనసమీకరణ చేయడమే కాదు, కానీ అది ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. కార్యకర్త రోడ్డుపై పడిపోయినా ఆయన దిగి చూడలేదు. ఆసుపత్రికి పంపితే ఆ ప్రాణం మిగిలేది. బాధితుడి తల్లిని కూర్చోబెట్టి ఓ గ్లాస్ మంచినీళ్లు ఇచ్చారా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి లోకేష్.
"బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లను ప్రోత్సహిస్తున్నారు అని జగన్ పై మండిపడ్డారు. మీ తండ్రి హయాంలో 164 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అప్పుడే భయపడలేదు. ఇప్పుడు మేము మరింత బలంగా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో తిరిగే హక్కు అందరికీ ఉంది. తిరగమంటేనే మనుషుల్ని చంపుతారా?" అని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే పలు సంక్షేమ పథకాలు ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, పెన్షన్లు, డీఎస్సీ నోటిఫికేషన్, రోడ్ల మరమ్మతులు, విద్యార్థుల మిత్ర కిట్లు లాంటి పథకాలను ప్రస్తావించారు.
లోకేష్ దాదాపు 1500 మందిని కలుసుకొని వారి సమస్యలు వినిపించారు. ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.