వైఎస్ జగన్ బంగారుపాళ్యంపై పర్యటనకు షరతులతో అనుమతి

హెలిప్యాడ్ వద్ద 30 మందికే, మామిడి యార్డ్‌లో 500 మందికే అనుమతి-చిత్తూరు ఎస్పీ స్పష్టం;

Update: 2025-07-07 13:59 GMT

ఈ నెల 9 వ తేదీన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహాన్ రెడ్డి గారి బంగారుపాలెం మండలం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి – జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మామిడి యార్డ్ నందు మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వబడిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్బముగా ముందస్తు చర్యలలో బాగంగా మామిడి యార్డ్, హెలిప్యాడ్ ప్రాంతం, రూట్ మ్యాప్ వంటి అంశాలను ఇప్పటికే పరిశీలించాము అన్నారు.

లా & ఆర్డర్ సమస్యలు రాకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మరియు ఇతర జిల్లాలలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా హెలిప్యాడ్ వద్ద 30 మంది నేతలను అనుమతిస్తామని మరియు మామిడి యార్డ్ నందు 500 మంది రైతులకు అనుమతి ఇస్తున్నాము అని,పర్యటన ముగిసే వరకు ఎలాంటి రోడ్ షోలు లేదా బహిరంగ సభలకు అనుమతి లేదు అని నిర్ధారించారు ఎస్పీ.

మామిడి యార్డ్ పక్కన స్కూల్స్ మరియు పెట్రోల్ బంకులు ఉన్నందున శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

హెలిప్యాడ్ చుట్టూ డబుల్ లేయర్ బారికేడ్ లు ఏర్పాటు చేసుకోవాలి మరియు పర్యటన సమమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఎటువంటి ప్రజా సమీకరణలు జరగకూడదు మరియు కూడలీల వద్ద ట్రాఫిక్ సమస్యలు సమస్యలు తలెత్తకుండా చూడాలి అన్నారు.

ఇంతకుముందు సత్యసాయి జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా బంగారుపాళ్యంలో కూడా ఆంక్షలు విధించబడ్డాయి అని ఎస్పీ తెలియచేసారు.

ఎవరైనా ఈ షరతులను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించినా, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.



Tags:    

Similar News