అచ్చెన్నాయుడు చొరవతో వెటర్నరీ కోర్సులకు కేంద్ర అనుమతి పునరుద్ధరణ

ఎరువుల కొరతపై అపోహలు వద్దు – రాష్ట్రంలో 8.73 లక్షల టన్నుల నిల్వ: అచ్చెన్నాయుడు;

Update: 2025-07-07 14:46 GMT

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని గరివిడిలో ఉన్న ‘కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌’లో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు గానూ మూడవ, నాల్గవ సంవత్సరాల బీవీఎస్‌సీ, ఏహెచ్ (B.V.Sc, A.H) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో, కొన్నేళ్లుగా నిలిచిపోయిన కొన్ని పశుసంవర్ధక కోర్సులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ అనుమతులు మంజూరు చేసింది. 2022 సంవత్సరం నుండి ఈ కోర్సులకు అనుమతి లభించకుండా ఉండగా, తాజా చొరవతో కేంద్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత కోర్సులకు అనుమతులను పునరుద్ధరించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర పశుసంవర్ధక & పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి లాలన్ సింగ్‌ను కలిసి మరిన్ని కీలక విషయాలు చర్చించనున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో (2019–2024) తోతాపురి మామిడి ధర కిలో రూ.6 నుంచి రూ.4కి పడిపోయిందని పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో రైతులకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదని మండిపడ్డారు. కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు కిలోకు అదనంగా రూ.4 సబ్సిడీ అందజేస్తోందని తెలిపారు.

చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని రైతుల నుంచి ఇప్పటివరకు 3.5 మెట్రిక్ టన్నుల మామిడి సేకరించామని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేస్తూ – మామిడి ధరలపై అసత్య ఆరోపణలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు.

కొద్ది రోజులుగా ఎరువుల కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. రాష్ట్రంలో ఎరువులు ప్రయాప్తంగా ఉండగా, రైతులు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఖరీఫ్ పంటలకు అవసరమైన ఎరువులు ఇప్పటికే నిల్వలలో ఉన్నాయని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8.73 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి అని,యూరియా మాత్రమే 3.12 లక్షల టన్నుల నిల్వ ఉంది అని,వచ్చే 3 నెలల్లో మరో 4.50 లక్షల టన్నుల యూరియా రానున్నది మంత్రి అచ్చెన్నాయుడు.ఎవరికైనా ప్రైవేట్ డీలర్లు ఎరువులపై కృత్రిమ కొరత సృష్టించినా, ఎంఆర్పీకి మించి విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News