'వీరమల్లు' ఎప్పుడొస్తాడు?
పవన్ కళ్యాణ్ భారీ పాన్ ఇండియా సినిమా 'హరిహర వీరమల్లు' విడుదల విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది.;
పవన్ కళ్యాణ్ భారీ పాన్ ఇండియా సినిమా 'హరిహర వీరమల్లు' విడుదల విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ చిత్రం మే 9న రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఆ సమయానికి రావడం లేదు. ప్రస్తుతం శ్రీ విష్ణు 'సింగిల్', సమంత నిర్మించిన 'శుభం' సినిమాలు అదే తేదీలో విడుదల కానున్నాయి.
ఈ వాయిదాకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీ షెడ్యూల్. ఈ చిత్రం కోసం పవర్ స్టార్ కేవలం నాలుగు రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందట. కానీ అది కుదరడం లేదు. ఇది సినిమా విడుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మే చివరిలో వద్దామనుకున్నా ఆ సమయానికి విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' ఉంది. ఒకవేళ 'వీరమల్లు' పట్టుబడితే ఆ తేదీని పవర్ స్టార్ కి ఇవ్వడానికి సితార సంస్థ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఇక జూన్ లో 'కుబేర, కన్నప్ప' వంటి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. మొత్తంగా 'హరి హర వీరమల్లు' జూలై కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం.
మరోవైపు ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయకపోవడం సినిమాపై బజ్ తగ్గించేస్తోంది. మేకర్స్ కూడా మీడియా ముందు కనిపించకపోవడంతో, ఫ్యాన్స్‌లో అసహనం పెరుగుతోంది. ఇన్ని ఆలస్యాలు, అపార్థాల మధ్య ఈ చిత్రం తొలి భాగమే ఇంత గందరగోళంగా ఉంటే, రెండో భాగం పరిస్థితి ఎలా ఉండబోతుందన్నదానిపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.