బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మహావతార్’
ఏ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం, ప్రహ్లాదుడి గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ యానిమేషన్ మహాకావ్యం, విడుదలైన 17 రోజులైనా బాక్సాఫీస్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.;
ఏ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం, ప్రహ్లాదుడి గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ యానిమేషన్ మహాకావ్యం, విడుదలైన 17 రోజులైనా బాక్సాఫీస్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రూ.10 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించిన 'మహావతార్ నరసింహ' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియన్ యానిమేషన్ సినిమాల్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఒక్క హిందీ వెర్షన్ నుంచే రూ.104 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఈ విజయానికి ప్రధాన హైలైట్.
ఆగస్టు 9న ఈ చిత్రం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ సాధించింది. బుక్ మై షోలోనే 5 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడవడం దీని క్రేజ్‌ను నిరూపించింది. ఈ ఆదివారం (ఆగస్టు 10) కూడా అంతకుమించి ఆక్యుపెన్సీ నమోదవుతుందయ్యిందని ట్రేడ్ అంచనాలున్నాయి.
ప్రారంభంలో కేవలం మైథాలజీ ప్రియులు, యానిమేషన్ అభిమానులు మాత్రమే చూడొచ్చనుకున్న ఈ సినిమాకి, ఇప్పుడు కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా పిల్లల ఆదరణ విపరీతంగా పెరిగింది. కథలోని భక్తి, యాక్షన్, భావోద్వేగాల మేళవింపు అన్ని వయసుల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది.