తారక్–హృతిక్ ‘బ్రదర్’ సెంటిమెంట్

హైదరాబాద్‌లో జరిగిన 'వార్ 2' ప్రీ రిలీజ్ వేడుక, అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ లా మారింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో స్టేజ్‌పైకి వచ్చి అభిమానుల్ని మైమరిపించారు.;

By :  S D R
Update: 2025-08-10 16:57 GMT

హైదరాబాద్‌లో జరిగిన 'వార్ 2' ప్రీ రిలీజ్ వేడుక, అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ లా మారింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో స్టేజ్‌పైకి వచ్చి అభిమానుల్ని మైమరిపించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంట్రీతోనే వేదిక హోరెత్తిపోయింది.

గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ మాటల్లో ఎన్టీఆర్ పట్ల స్నేహం, అభిమానంతో నిండిన సెంటిమెంట్ కనిపించింది. 'తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు. మనం అందరం ఒకే కుటుంబం. 'క్రిష్' షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు ప్రజల ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మరోసారి మీ ముందుకు వచ్చాను. తారక్, నేను కో-స్టార్స్‌గా మొదలుపెట్టినా.. చివరికి నిజమైన బ్రదర్స్‌గా మారిపోయాం' అని హృతిక్ చెప్పగానే అభిమానులు హర్షధ్వానాలు చేశారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వయసులో కుర్రాడిలా ఉన్నా.. ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ఆగస్టు 14న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది' అని విశ్వాసం వ్యక్తం చేశారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. 'టీజర్, ట్రైలర్‌కు మించి సినిమా ఉంటుంది. కథలో మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా తీయడం పెద్ద బాధ్యత. మేము చాలా జాగ్రత్తగా తీశాం' అని అన్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్ నా అభిమాన వ్యక్తి. ఆయనతో నా ప్రయాణం పాతికేళ్లు. మొన్న 'మ్యాడ్' ఫంక్షన్‌లో తారక్‌ను ‘దేవర’ నామ సంవత్సరంగా అన్నాను.. ఇప్పుడు హృతిక్‌తో కలిసి ‘తారక్ నామ సంవత్సరం’ అని చెప్పుకుందాం. ఈ సినిమా ఫైట్స్, యాక్షన్ కంటే ఎక్కువ సర్‌ప్రైజ్ ఇస్తుంది. ఒకరు హిమాలయ పర్వతం, ఇంకొకరు వింధ్య పర్వతం. ఇద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం అంత సులభం కాదు' అని అన్నారు.

మొత్తంగా తారక్-హృతిక్ వంటి స్టార్ పవర్ తో 'వార్ 2' ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల మదిలో మిగిలిపోయింది. ఆగస్టు 14న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో ఎలా దుమ్ము రేపుతుందో చూడాలి.

Tags:    

Similar News