'వార్ 2' ప్రీ రిలీజ్ కి ఏర్పాట్లు!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీస్టారర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీస్టారర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతుంది టీమ్.
ఈరోజు హైదరాబాద్ యూసుఫ్‌గూడ కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అట్టహాసంగా ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. ఇద్దరు అగ్రతారలు ఒకే వేదికపై కనిపించనున్నందున అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. ఇటీవల విడుదలైన 'సలామ్ అనాలి' పాటలో ఎన్టీఆర్-హృతిక్ డాన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ప్రమోషన్‌లో భాగంగా సోషల్ మీడియాలో '#HrithikvsNTR' – '#NTRvsHrithik' హ్యాష్‌ట్యాగ్‌లపై ఇద్దరూ సరదాగా ‘క్రెడిట్ వార్’ పెట్టుకోవడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో, YRF స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.