ఫెడరేషన్ తో ఫిలిం ఛాంబర్ చర్చలు విఫలం

తెలుగు సినీ పరిశ్రమలో వేతన పెంపు అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో, నిర్మాతలు కార్మికుల వేతనాలపై తమ స్పష్టమైన ప్రతిపాదనలను వెల్లడించారు.;

By :  S D R
Update: 2025-08-09 14:43 GMT

తెలుగు సినీ పరిశ్రమలో వేతన పెంపు అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో, నిర్మాతలు కార్మికుల వేతనాలపై తమ స్పష్టమైన ప్రతిపాదనలను వెల్లడించారు.

రోజుకు ₹2000 లేదా అంతకంటే తక్కువ వేతనం పొందే కార్మికులకు మొదటి సంవత్సరం: 15% పెంపు, రెండవ సంవత్సరం: 5% పెంపు, మూడవ సంవత్సరం: 5% పెంపు. రోజుకు ₹1000 లేదా అంతకంటే తక్కువ వేతనం పొందే కార్మికులకు మొదటి సంవత్సరం: 20% పెంపు, రెండవ సంవత్సరం: 0% పెంపు, మూడవ సంవత్సరం: 5% పెంపు ఉంటుందని స్పష్టం చేశారు నిర్మాతలు.

అయితే.. వేతనాల పెంపుపై ఫిలిం ఛాంబర్ తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఫెడరేషన్ తెలిపింది. వేతనాలు 30% పెంచితేనే షూటింగ్ కి వెళ్తాం అని ఫెడరేషన్ స్పష్టం చేసింది. నిర్మాతలు చెప్పిన పర్సంటేజ్ విధానం మాకు అంగీకారం కాదు, నిర్మాతల షరతుల పట్ల మేము సుముఖంగానే ఉన్నాము.. అది పెద్ద సమస్య కాదు దశలవారీగా వారి షరతులని అంగీకరిస్తాము అని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అన్నారు.

అలాగే అన్ని యూనియన్లకి సమానంగా పెంచాల్సిందే అంటూ అనిల్ డిమాండ్ చేశారు. ఇక నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని.. రేపు ఉదయం 8.30am గంటలకి మా నిరసన కార్యక్రమం ఉంటుందని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అన్నారు.

Tags:    

Similar News