వేతనాల పెంపుకు గ్రీన్ సిగ్నల్

ఫిల్మ్‌ ఛాంబర్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం జరిగింది. కార్మికుల వేతన పెంపు అంశంపై నిర్మాతలు స్పష్టతనిచ్చారు.;

By :  S D R
Update: 2025-08-09 13:45 GMT

ఫిల్మ్‌ ఛాంబర్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం జరిగింది. కార్మికుల వేతన పెంపు అంశంపై నిర్మాతలు స్పష్టతనిచ్చారు. ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వివరించిన ప్రకారం.. రోజుకు ₹2000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15% వేతన పెంపు, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంపు అమలు చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

రోజుకు ₹1000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు, మొదటి ఏడాది 20% వేతన పెంపు, రెండో ఏడాది పెంపు లేదు (0%), మూడో ఏడాది 5% పెంపు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే.. ఇప్పటికే నిర్మాతలు పెట్టిన షరతులకు ఫెడరేషన్ ఓకే అంటేనే ఈ వేతన పెంపు అమలు చేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు.

ఈ మీడియా సమావేశానికి విశ్వ ప్రసాద్, నాగ వంశీ, మైత్రీ నవీన్, సుధాకర్ చెరుకూరి, రాధామోహన్, సాహు గారపాటి, ఎస్.కె.ఎన్., బాపినీడు, చెర్రీ తదితర ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు.

Tags:    

Similar News