మహేష్-రాజమౌళి మూవీ ఫస్ట్ లుక్

ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజులో రాబోతున్న క్రేజీ మూవీస్ లో SSMB29 ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది.;

By :  S D R
Update: 2025-08-09 06:57 GMT

ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజులో రాబోతున్న క్రేజీ మూవీస్ లో SSMB29 ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందా? అని ఎదురు చూశారు ఫ్యాన్స్. ఆ ఆశలు ఫలించాయి.

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ప్రత్యేక సర్‌ప్రైజ్‌గా హీరో ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ పోస్టర్ లో మహేష్ మెడలో త్రిశూలం, నందితో కూడిన లాకెట్, రక్తపు చారలతో కనిపించాడు. అయితే.. మహేష్ ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. అందుకోసం నవంబర్ వరకూ ఆగాల్సిందే అంటూ హింట్ ఇచ్చాడు. అలాగే సినిమా స్కోప్ చాలా పెద్దది. ఇప్పుడే ఇమేజ్‌లు లేదా ప్రెస్‌మీట్ పెట్టడం స్టోరీకి న్యాయం చేయదు’ అని జక్కన్న స్పష్టం చేశాడు.



Tags:    

Similar News