హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు, వారసత్వం అనే ట్యాగ్‌తో సులభంగా ఎంట్రీ పొందినా, స్టార్‌డమ్ కోసం కఠిన శ్రమ, పట్టుదలతో ఎన్నో అడ్డంకులను అధిగమించాడు.;
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు, వారసత్వం అనే ట్యాగ్‌తో సులభంగా ఎంట్రీ పొందినా, స్టార్‌డమ్ కోసం కఠిన శ్రమ, పట్టుదలతో ఎన్నో అడ్డంకులను అధిగమించాడు. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘నీడ’, ‘పోరాటం’, ‘బజారు రౌడీ’, 'కొడుకు దిద్దిన కాపురం' లాంటి సినిమాలతో మొదలైన అతని ప్రయాణం, చదువు కోసం తాత్కాలికంగా సినిమాలకు దూరమైంది.
హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాజకుమారుడు’తో ఘనంగా రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్‌తో పాటు నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే, ‘యువరాజు’, ‘వంశీ’ లాంటి వరుస ఫ్లాప్‌లతో కొంత నిరాశ ఎదురైనా, ‘మురారి’తో సూపర్ హిట్ సాధించి అభిమానులకు ఊరటనిచ్చాడు.
‘టక్కరి దొంగ’లో ప్రయోగాత్మక కౌబాయ్ పాత్రతో ఆకట్టుకున్నా, వాణిజ్యపరంగా విజయం సాధించలేదు. అయినప్పటికీ, ‘ఒక్కడు’ సినిమా మహేష్ కెరీర్‌ను మలుపు తిప్పింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌లో బలమైన ఇమేజ్‌ను సృష్టించి, ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
‘నిజం’, ‘నాని’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆకట్టుకోలేకపోయినా, ‘అతడు’ సినిమా మహేష్‌ను టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిపింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కొత్త ఊపును తెచ్చిన ఈ చిత్రం మరో నంది అవార్డును అందించింది. ‘పోకిరి’తో మాత్రం మహేష్ బాబు టాలీవుడ్ రికార్డులను తిరగరాసి, మాస్ హీరోగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.
‘సైనికుడు’, ‘అతిధి’, ‘ఖలేజా’ లాంటి ఫ్లాప్‌లు ఎదురైనా, ‘ఖలేజా’లో కామెడీతో కొత్త ఇమేజ్‌ను సృష్టించాడు. ‘దూకుడు’, ‘బిజినెస్ మేన్’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేష్‌తో కలిసి మల్టీస్టారర్‌లో నటించి, వైవిధ్యాన్ని చాటాడు. ‘వన్ నేనొక్కడినే’ సైకలాజికల్ థ్రిల్లర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ‘ఆగడు’ డిజాస్టర్ తర్వాత, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’ లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.
2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’ ఆశించిన విజయం సాధించలేకపోయినా, ప్రస్తుతం రాజమౌళితో పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో కొత్త మేకోవర్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. వారసుడిగా వచ్చిన మహేష్, స్వయంకృషితో టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగి, ఓవర్సీస్ మార్కెట్‌ను విస్తరించి, తనదైన శైలితో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మహేష్ మరిన్ని విజయాలతో అలరించాలని కోరుకుంటూ సూపర్‌స్టార్ బర్త్‌డే విషెస్ తెలియజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.