'జడల్' స్వాగ్ అదిరింది
నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్న చిత్రం 'ది ప్యారడైజ్'.;
నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఈరోజు ఉదయం వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో రెండు జడలతో ఆకట్టుకుంటున్నాడు నాని.
లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి నాని సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చుట్టూరా మారణాయుధాలతో జనం.. కానీ ఎలాంటి బెరుకు లేకుండా కుర్చీలో కూర్చున్న జడల్ (నాని) లుక్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తుంది. ఈ సినిమా నుంచి ప్రతీ క్యారెక్టర్ కు సంబంధించి రెండు షేడ్స్ లో లుక్స్ రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించింది టీమ్. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీషు, స్పానిష్ భాషలలో విడుదలకు ముస్తాబవుతుంది.