'ఫౌజీ' సగం టార్గెట్ ఫినిష్

పీరియాడిక్ మూవీస్ కి కేరాఫ్ ప్రభాస్. ఓ యోధుడి తరహా పాత్ర చేయాలంటే ఫిల్మ్ మేకర్స్ కు ప్రధానంగా గుర్తొచ్చే పేరు డార్లింగ్. అలా ప్రభాస్ ను రెండో ప్రపంచ యుద్ధం నాటి యోధుడిగా ఆవిష్కరించబోతున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి.;

By :  S D R
Update: 2025-08-08 12:37 GMT

పీరియాడిక్ మూవీస్ కి కేరాఫ్ ప్రభాస్. ఓ యోధుడి తరహా పాత్ర చేయాలంటే ఫిల్మ్ మేకర్స్ కు ప్రధానంగా గుర్తొచ్చే పేరు డార్లింగ్. అలా ప్రభాస్ ను రెండో ప్రపంచ యుద్ధం నాటి యోధుడిగా ఆవిష్కరించబోతున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

లేటెస్ట్ గా 'ఫౌజీ' మూవీ సగం వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకోసం ప్రభాస్ కేవలం 30 రోజుల పాటు పనిచేస్తే సరిపోతుందట. మిగతా షూట్ మరో రెండు, మూడు వారాలు ఉంటుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని.. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే 'ఫౌజీ'ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందట టీమ్. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కొత్తమ్మాయి ఇమాన్వి నటిస్తుంది. కీలక పాత్రల్లో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి వెటరన్స్ కనిపించబోతున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మరోవైపు 'ది రాజా సాబ్'ను ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చిన ప్రభాస్.. 'ఫౌజీ'లో తన పార్ట్ ను ఫినిష్ చేస్తూనే సెప్టెంబర్ నుంచి 'స్పిరిట్'ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఆ తర్వాత 'సలార్ 2, కల్కి 2' వంటి చిత్రాలు రెబెల్ స్టార్ కిట్టీలో ఉన్నాయి.

Tags:    

Similar News