'అఖండ 2' డబ్బింగ్ కంప్లీటెడ్!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న చిత్రం 'అఖండ 2'. ఆన్ స్క్రీన్ పై బాలయ్య ఎనర్జీని అత్యద్భుతంగా ఆవిష్కరించే దర్శకుల్లో బోయపాటి ముందు వరుసలో నిలుస్తాడు.;

By :  S D R
Update: 2025-08-08 08:51 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న చిత్రం 'అఖండ 2'. ఆన్ స్క్రీన్ పై బాలయ్య ఎనర్జీని అత్యద్భుతంగా ఆవిష్కరించే దర్శకుల్లో బోయపాటి ముందు వరుసలో నిలుస్తాడు. ఇప్పటికే నటసింహంకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చి.. ఇప్పుడు 'అఖండ 2'తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నాడు. బ్లాక్ బస్టర్ 'అఖండ'కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది.

లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాడు బాలయ్య. అందుకు సంబంధించి ఓ ఫోటోని షేర్ చేసింది నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్. మరోవైపు 'అఖండ 2' ఆలస్యమవుతుందని.. ముందుగా అనుకున్నట్టు దసరా బరిలో రాదనే ప్రచారం జరుగుతుంది. కానీ.. లేటెస్ట్ గా నిర్మాణ సంస్థ ఇచ్చిన ఈ అప్డేట్ తో దసరా బరిలో 'అఖండ 2' ఆగమనం పక్కా అని తేలిపోయింది.

మరోవైపు పవన్ కళ్యాణ్ 'ఓజీ' కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా బరిలో వచ్చేందుకు సన్నద్దమవుతుంది. ఈనేపథ్యంలో వచ్చే దసరాకి బాక్సాఫీస్ వద్ద బాలయ్య వర్సెస్ పవన్ వార్ దాదాపు ఖాయమైనట్టే.



Tags:    

Similar News