'మెగా 157' క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. మెగా ఫ్యాన్స్ కు పండగ రోజు. ఈసారి మెగా బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్ లో జరగబోతున్నాయి.;
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. మెగా ఫ్యాన్స్ కు పండగ రోజు. ఈసారి మెగా బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్ లో జరగబోతున్నాయి. చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమాతో పాటు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'మెగా 157' నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుంది. 'మెగా 157' టైటిల్ టీజర్ ను చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారట.
ఇదే విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన శైలిలో 'దొంగ మొగుడు' చిత్రంలోని చిరంజీవి చెప్పే 'దా దా' అనే డైలాగ్ తో ఆగస్టు 22న మెగా ట్రీట్ ఉండబోతున్నట్టు చెప్పాడు. ఈ సినిమాలో వింటేజ్ చిరుని ఆవిష్కరించబోతున్నాడట అనిల్. చాలా రోజుల తర్వాత చిరంజీవి నుంచి రాబోతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'మెగా 157' అవుతుందనే అంచనాలున్నాయి.
ఈ మూవీలో చిరు సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. మరో కీలక పాత్రలో కేథరిన్ కనిపించనుంది. భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.