ఆమరణ దీక్షకు సిద్ధం
గత ఎనిమిది రోజులుగా వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్నామని, 30 శాతం వేతనాలు ఇస్తున్న నిర్మాతల వద్ద మాత్రమే పని కొనసాగిస్తున్నామని సినీ కార్మికుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు.;
గత ఎనిమిది రోజులుగా వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్నామని, 30 శాతం వేతనాలు ఇస్తున్న నిర్మాతల వద్ద మాత్రమే పని కొనసాగిస్తున్నామని సినీ కార్మికుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు.
'ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిగాయి. నిన్న సమస్య పరిష్కారమవుతుందని అనుకున్నాం. మేమేమి అధిక డిమాండ్లు చేయలేదు. ముందుగా 20 శాతం పెంపు, రెండేళ్ల తరువాత మరో 10 శాతం పెంచమని మాత్రమే కోరాం. కానీ వారు ప్రతి ఏడాది కొద్దిగా మాత్రమే పెంపు చేయాలని, కొన్ని యూనియన్లకు అయితే అసలు పెంపు ఉండదని చెప్పారు' అని ఆయన అన్నారు.
ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్‌కి కూడా వేతనాల పెంపు అవసరమని గుర్తుచేసిన ఆయన, 'పొట్ట కాలితే వారే దారికొస్తారు అన్నట్టుగా నిర్మాతల వైఖరి కనిపిస్తోంది. అందరి కార్మికుల వేతనాలు పెంచాలి' అని స్పష్టం చేశారు.
లేబర్ కమిషనర్ ఆఫీసులో చర్చలు జరగనున్నాయని, ఆలోపు ఛాంబర్‌తో మళ్లీ చర్చలు జరపమని సూచించారని తెలిపారు. 'ఛాంబర్‌తో చర్చలు విఫలమైతే సమ్మె కొనసాగుతుంది. విశ్వ ప్రసాద్ పంపిన నోటీసులపై లీగల్‌గా వెళ్తాం. ఆయన నుండి మాకు రూ.90 లక్షల బకాయిలు రావాల్సి ఉంది. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని మా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా ఇబ్బంది ఉంటే ఛాంబర్‌కు చెప్పాలి కానీ, ఎలా పడితే అలా మాట్లాడకూడదు' అని వ్యాఖ్యానించారు.