ప్రభాస్ ప్లానింగ్ ఏంటి?

భారతీయ సినీ పరిశ్రమలో ప్ర‌స్తుతం అత్యంత డిమాండ్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే.. సందేహం లేకుండా ప్ర‌భాస్ పేరే ముందుకు వస్తుంది. ప్రెజెంట్ వరుసగా పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఇండియాలోనే బిజీయెస్ట్ హీరోగా ఉన్నాడు రెబెల్ స్టార్.;

By :  S D R
Update: 2025-08-25 01:04 GMT

భారతీయ సినీ పరిశ్రమలో ప్ర‌స్తుతం అత్యంత డిమాండ్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే.. సందేహం లేకుండా ప్ర‌భాస్ పేరే ముందుకు వస్తుంది. ప్రెజెంట్ వరుసగా పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఇండియాలోనే బిజీయెస్ట్ హీరోగా ఉన్నాడు రెబెల్ స్టార్. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఒకేసారి పలు చిత్రాల మేకర్స్ ఆయన డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'ది రాజా సాబ్' ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాకోసం ప్రభాస్ కేవలం కొన్ని రోజుల కాల్షీట్స్ ఇస్తే సరిపోతుందట. డిసెంబర్ లో ఈ సినిమాని విడుదల చేద్దాము అనుకున్నా.. సంక్రాంతికి షిప్ట్ అవుతుందనే ప్రచారం ఉంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' ఇప్పటికే సగం దాకా పూర్తయింది.

ఇక 'సలార్ 2' కోసం చాలా టైమ్ పట్టొచ్చు. అందుకే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈలోపులో ఎన్టీఆర్ తో 'డ్రాగన్‌'ను పూర్తి చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కిట్టీలో ఉన్న మిగతా రెండు పెద్ద ప్రాజెక్ట్స్ 'స్పిరిట్, కల్కి 2' మేకర్స్ మాత్రం రెబెల్ స్టార్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'స్పిరిట్' కోసం సందీప్ బల్క్ డేట్స్ కావాలని కోరుకుంటున్నాడు. కంటిన్యూ గా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనేది సందీప్ ప్లానింగ్. మరోవైపు 'కల్కి-2' టీమ్ మాత్రం ఫ్లెక్సిబుల్‌గా ఉంది. ప్ర‌భాస్ నుంచి లభించే చిన్న చిన్న కాల్‌షీట్స్‌ని సైతం వాడుకుని షూటింగ్ కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా.. ఒకేసారి ఐదారు సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ మేనేజ్‌మెంట్‌లో ప్రభాస్ ఇప్పుడు పెద్ద సవాల్ ఎదుర్కొంటున్నాడు.

Tags:    

Similar News