తమన్నా కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ అప్పటి నుంచే.. !

ఆమె తాజా ప్రాజెక్ట్ “డూ యూ వన్నా పార్ట్‌నర్”. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ సిరీస్‌లో తమన్నా భాటియాతో పాటు డయానా పెంటీ కూడా నటిస్తోంది.;

By :  K R K
Update: 2025-08-26 01:21 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలతోనూ, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోని సీరిస్ లో వైవిధ్యమైన పాత్రలతో రాణిస్తోంది. ఆమె ఇప్పుడొక కామెడీ సిరీస్‌లో నటించబోతోంది. ఇప్పటికే వెబ్ ఫిల్మ్‌లు, సిరీస్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో బలమైన స్థానం సంపాదించిన ఆమె.. కొత్త సవాలును స్వీకరించింది. ఆమె తాజా ప్రాజెక్ట్ “డూ యూ వన్నా పార్ట్‌నర్”. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ సిరీస్‌లో తమన్నా భాటియాతో పాటు డయానా పెంటీ కూడా నటిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 12న ప్రీమియర్ కానున్న ఈ సిరీస్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తమ సొంత ఆల్కహాల్ స్టార్టప్‌ను ప్రారంభించే జర్నీలో ఎదుర్కొనే ఆనందాలు, సవాళ్లను ఎలివేట్ చేస్తుంది. తమన్నా అండ్ డయానా ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించనున్నారు.“డూ యూ వన్నా పార్ట్‌నర్” సిరీస్ తమన్నాకు ఓ సరికొత్త అవతారాన్ని అందిస్తూ, హాస్యంతో పాటు స్టార్టప్ ప్రపంచంలోని వినూత్నతను మేళవిస్తుంది.

సినిమాలు, డాన్స్ నంబర్స్‌తో పాటు, తమన్నా ఈ ప్రాజెక్ట్‌తో వెబ్ డ్రామాల్లో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరిస్తోంది. అయితే, ఆమె తదుపరి తెలుగు ప్రాజెక్ట్ గురించి ఇంకా ప్రకటన చేయలేదు. మరి ఈ వెబ్ సిరీస్ తమ్మూకి ఏ రేంజ్ లో ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.



Tags:    

Similar News