ఓటీటీలోకి ‘కింగ్ డమ్’ వచ్చేది ఎప్పుడంటే... !

నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, “కింగ్‌డమ్” ఆగస్టు 28, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.;

By :  K R K
Update: 2025-08-12 00:37 GMT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన “కింగ్‌డమ్” సినిమా జులై 31, 2025న విడుదలై, మిశ్రమ స్పందనలు పొందింది. తొలి వీకెండ్‌లో భారీ ఓపెనింగ్స్‌తో బ్లాక్‌బస్టర్ అవుతుందని అనిపించినా.. ఆ తర్వాత థియేటర్లలో ఊపు కొనసాగలేదు. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. విడుదలకు ముందే నిర్మాతలు ఓటీటీ ఒప్పందం కుదుర్చుకున్నారు.

నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, “కింగ్‌డమ్” ఆగస్టు 28, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సినిమాలు సాధారణంగా థియేటర్ విడుదలై నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తున్న ట్రెండ్‌కు ఇది మినహాయింపు కాదు. అయితే.. నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఈ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

“కింగ్‌డమ్” సినిమా బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఒక తెగ తమ భూమిని తిరిగి సొంతం చేసుకోవడానికి చేసే పోరాటం చుట్టూ తిరిగే కథాంశంతో మల్టిపుల్ నేటివ్ థ్రెడ్స్‌ను కలిగి ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అయితే, అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ సినిమా ఓటీటీలో అయినా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News