ఓటీటీలోకి రాబోతున్న ‘జూనియర్’

ఆగస్టు 15, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరణ రాలేదు.;

By :  K R K
Update: 2025-08-13 09:56 GMT

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి... ‘జూనియర్’ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. రాధాకృష్ణా రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ బజ్‌తో వార్తల్లో నిలిచింది.

ఆగస్టు 15, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరణ రాలేదు. కన్నడ, తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కావచ్చు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ సాధించింది. మాస్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ పొందినప్పటికీ, ఊహించదగిన కథాంశం కారణంగా అందరినీ ఆకట్టుకోలేకపోయింది.

ఓటీటీ వీక్షకుల స్పందన ఈ సినిమాకు కొత్త ఊపు తెచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. రజని కొర్రపాటి నిర్మాణంలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో వి. రవిచంద్రన్, జెనీలియా దేశ్‌ముఖ్, రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వివా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Tags:    

Similar News