ఓటీటీలోకి రాబోతున్న ‘కింగ్ డమ్’
“కింగ్‌డమ్” ఆగస్టు 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో “కింగ్‌డమ్” పేరుతో, హిందీలో “సామ్రాజ్య” పేరుతో విడుదలవుతుంది.;
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పీరియడ్ డ్రామా “కింగ్‌డమ్”. జూలై 31న థియేటర్లలో విడుదలై.. ఊహించనంత త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సాధారణంగా సినిమాలు థియేటర్లలో కనీసం నెల రోజుల తర్వాత ఆన్‌లైన్‌లోకి వస్తాయి. కానీ “కింగ్‌డమ్” ఆగస్టు 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో “కింగ్‌డమ్” పేరుతో, హిందీలో “సామ్రాజ్య” పేరుతో విడుదలవుతుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, శ్రీలంకలో ఎక్కువగా చిత్రీకరించిన ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఆకట్టుకున్నప్పటికీ, తర్వాత వేగం కోల్పోయింది. బలమైన సంగీతం లేకపోవడం, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే మధ్య రొమాంటిక్ ట్రాక్ బలహీనంగా ఉండటం వల్ల యువ ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైందని విమర్శకులు, ప్రేక్షకులు భావించారు.
నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో లాభదాయకమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తోంది. మరి థియేటర్స్ లో నిరాశపరిచిన ‘కింగ్ డమ్’ మూవీ ఓటీటీలో అయినా జనాన్ని మెప్పిస్తుందేమో చూడాలి.