అల్లు-అట్లీ మూవీ మేకర్స్ స్ట్రిక్ట్ రూల్స్ !
“సన్ పిక్చర్స్ సంస్థ అందరు నటీనటులు, సిబ్బందితో ఒక ఎన్‌డీఏ (నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్) కుదుర్చుకుంది. నిర్మాణం పూర్తయ్యే వరకు నేను ఏ వివరాలూ వెల్లడించలేను,” అని ఆయన స్పష్టం చేశారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ల కాంబినేషన్‌లోని భారీ చిత్రం నిర్మాణం ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో జరుగుతోంది. ఈ ప్రత్యేక కథలో సైన్స్-ఫిక్షన్, పౌరాణిక అంశాలను మేళవించేందుకు అట్లీ తన విజన్‌ను అద్భుతంగా అమలు చేయడానికి హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దింపాడు. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం అంతర్జాతీయ సిబ్బంది కూడా చురుకుగా పనిచేస్తున్నారు.
అయితే.. నిర్మాత బన్నీ వాస్ ను.. తన రాబోయే చిత్రం ‘కన్యాకుమారి’ ప్రమోషన్స్ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా గురించి అడిగినప్పుడు ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. “సన్ పిక్చర్స్ సంస్థ అందరు నటీనటులు, సిబ్బందితో ఒక ఎన్‌డీఏ (నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్) కుదుర్చుకుంది. నిర్మాణం పూర్తయ్యే వరకు నేను ఏ వివరాలూ వెల్లడించలేను,” అని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల సినీ వర్కర్స్ సమ్మె వల్ల షూటింగ్ షెడ్యూల్ కొంత ఆటంకానికి గురైందని బన్నీ వాస్ తెలిపారు. “హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇక్కడ పనిచేస్తున్నందున, వారి సమయాన్ని వృథా చేయకుండా ఉండేందుకు మేము ఫెడరేషన్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకున్నాం,” అని ఆయన చెప్పారు. ఈ భారీ ఎంటర్‌టైనర్ లో అల్లు అర్జున్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా.. దీపికా పదుకొణె ఒక ముఖ్యమైన స్త్రీ పాత్రలో కనిపించనుంది.