‘ఓజీ’ బిజినెస్ లెక్కలు
టాలీవుడ్ నుంచి థియేటర్లలోకి రాబోతున్న సెన్సేషనల్ మూవీ 'ఓజీ'. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే భారీ హైప్ ఉన్న మూవీ ఇది. సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.;
టాలీవుడ్ నుంచి థియేటర్లలోకి రాబోతున్న సెన్సేషనల్ మూవీ 'ఓజీ'. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే భారీ హైప్ ఉన్న మూవీ ఇది. సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సింగిల్ 'పైర్ స్టార్మ్'లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. వినాయకచవితి కానుకగా రెండో పాటను విడుదల చేయబోతున్నారు.
దసరా కానుకగా సెప్టెంబర్ 25న రాబోతున్న 'ఓజీ' ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నైజాం రైట్స్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ.60 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్ర హక్కులు రూ.75 కోట్లు, రాయలసీమ హక్కులు రూ.25 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 18 లేదా 19న నిర్వహించే అవకాశం ఉందట. 'ఓజీ' సినిమాతో పవర్‌స్టార్ వంద కోట్ల షేర్ సాధిస్తాడనే అంచనాలున్నాయి. పవన్ అభిమానులు ఈ దసరా స్పెషల్ ట్రీట్‌గా 'ఓజీ' కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.