‘మిరాయ్‘ కొత్త రిలీజ్ డేట్
తేజ సజ్జ ‘మిరాయ్‘ వాయిదా పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ముందుగా సెప్టెంబర్ 5న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. లేటెస్ట్ గా ఈ సినిమాని సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.;
తేజ సజ్జ ‘మిరాయ్‘ వాయిదా పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ముందుగా సెప్టెంబర్ 5న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. లేటెస్ట్ గా ఈ సినిమాని సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 28న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో తేజ సజ్జ, విలన్ మంచు మనోజ్ నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ సందడి చేస్తున్నారు.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో తేజ సజ్జాకి జోడీగా రితిక నాయక్ నటించింది. మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గౌర హరి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. హిందీలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ‘మిరాయ్‘ అదరహో అనిపిస్తుంది.