‘మాస్ జాతర’ విడుదల వాయిదా
మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా రూపొందుతుంది ‘మాస్ జాతర‘. రేపు వినాయక చవితి కానుకగా ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. అయితే.. ఇటీవల చిత్ర పరిశ్రమలో జరిగిన సమ్మె, ఇంకా సినిమాకి సంబంధించి కీలక కంటెంట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం వంటి కారణాలతో ‘మాస్ జాతర‘ను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్.;
మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా రూపొందుతుంది ‘మాస్ జాతర‘. రేపు వినాయక చవితి కానుకగా ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. అయితే.. ఇటీవల చిత్ర పరిశ్రమలో జరిగిన సమ్మె, ఇంకా సినిమాకి సంబంధించి కీలక కంటెంట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం వంటి కారణాలతో ‘మాస్ జాతర‘ను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్.
‘కంగారుగా విడుదల చేయడం కంటే కాస్త సమయం తీసుకొని, అత్యుత్తమ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. అభిమానుల నిరీక్షణకు బహుమానంగా త్వరలో స్పెషల్ కంటెంట్ రాబోతోంది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం‘ అని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ కు, సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మాస్ జాతర’పై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి.