వరుస ప్రమోషన్స్ తో బిజీ కానున్న అనుష్క

సాధారణంగా ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండే అనుష్క, “ఘాటి” రిలీజ్ కోసం వీడియో ఇంటర్వ్యూల్లో యాక్టివ్‌గా పాల్గొననుంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన “ఘాటి” సెప్టెంబర్‌లో విడుదల కానుంది.;

By :  K R K
Update: 2025-08-26 01:32 GMT

అందాల అనుష్క శెట్టి రెండేళ్ల విరామం తర్వాత “ఘాటి” సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. 2023లో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” తర్వాత ఆమె సైన్ చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఇది. సాధారణంగా ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండే అనుష్క, “ఘాటి” రిలీజ్ కోసం వీడియో ఇంటర్వ్యూల్లో యాక్టివ్‌గా పాల్గొననుంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన “ఘాటి” సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

ఆసక్తికరంగా.. ఈ సినిమా కర్ణాటక రైట్స్‌ను కన్నడ సూపర్‌స్టార్ యష్ తల్లి పుష్ప సొంతం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో “ఘాటి” ప్రమోషన్స్‌తో బిజీగా ఉండే అనుష్క.. అక్టోబర్‌లో “బాహుబలి ది ఎపిక్” కోసం మరోసారి మీడియా, సోషల్ మీడియాలో సందడి చేయనుంది.

ఎస్ఎస్ రాజమౌళి రెండు ‘బాహుబలి’ సినిమాలను కలిపి రీ-ఎడిట్ చేసిన “బాహుబలి ది ఎపిక్” అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్‌తో కలిసి అనుష్క ఇంటర్వ్యూల్లో పాల్గొననుంది. సో.. అలా.. వరుస ప్రమోషనల్ క్యాంపెయిన్స్‌తో అనుష్క శెట్టి అభిమానులకు రాబోయే నెలల్లో ఆమెను ఎక్కువగా చూసే అవకాశం ఉంది.

Tags:    

Similar News