బాలకృష్ణ-మలినేని ముహూర్తం ఫిక్స్!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సినిమాల స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటితరం యువ హీరోలకు మించిన రీతిలో వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు నటసింహం.;

By :  S D R
Update: 2025-08-26 00:59 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సినిమాల స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటితరం యువ హీరోలకు మించిన రీతిలో వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు నటసింహం. 'డాకు మహారాజ్' వంటి హిట్ తర్వాత ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2'ని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. దసరా బరిలోనే రావాల్సిన 'అఖండ 2' పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా వాయిదా పడుతుందనే ప్రచారం ఉంది.

ఇప్పటికే 'అఖండ 2'కి సంబంధించి బాలయ్య వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇక బాలయ్య 111వ ప్రాజెక్ట్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ రానుంది. ఇందులో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌ చేయబోతుండగా, కథలో సోషియో ఫాంటసీ, పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌ ఉండనున్నాయని టాక్.

వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమాను అక్టోబర్ 2న లాంఛ్ చేయనుందట. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, 2026, దసరా బరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట డైరెక్టర్ గోపీచంద్ మలినేని.

మరోవైపు బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో మరో సినిమా కూడా సెట్స్‌పైకి రావడానికి సిద్ధమవుతోంది. 'ఆదిత్య 369' సీక్వెల్ అయిన 'ఆదిత్య 999' కోసమే బాలకృష్ణ-క్రిష్ కలవబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News