అవసరమైతే థియేటర్లు తగలపెట్టేద్దాం!
“కింగ్డమ్” ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకున్న శ్లోక ఎంటర్టైన్మెంట్స్, ఈ సినిమా అమెరికాలో జులై 3 నే ప్రీమియర్ అవుతుందని స్పష్టం చేసింది. అమెరికన్ ఇండిపెండెన్స్ డే సెలవుల సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ తేదీని ఎంచుకున్నారు.;
తాజాగా.. విజయ్ దేవరకొండ నటించిన “కింగ్డమ్” సినిమా వాయిదా పడవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కారణం, పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరి హర వీర మల్లు” సినిమా జులై 4న విడుదల కావచ్చని తాజా సమాచారం. మొదట జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఆ తేదీ నుంచి జులై 4కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ.. “కింగ్డమ్” ఆల్రెడీ జులై 4నే లాక్ చేసుకుంది.
నిర్మాత నాగ వంశీ, పవన్ కళ్యాణ్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉండడంతో, “కింగ్డమ్” తప్పుకుని, “హరి హర వీర మల్లు”కి దారి ఇస్తుందనే టాక్ నడిచింది. అయితే, “కింగ్డమ్” ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకున్న శ్లోక ఎంటర్టైన్మెంట్స్, ఈ సినిమా అమెరికాలో జులై 3 నే ప్రీమియర్ అవుతుందని స్పష్టం చేసింది. అమెరికన్ ఇండిపెండెన్స్ డే సెలవుల సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ తేదీని ఎంచుకున్నారు.
“తేదీలో ఎలాంటి మార్పు లేదు,” అని సితారా ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇంకా జోడిస్తూ, “అవసరమైతే థియేటర్లు తగలపెట్టేద్దాం!” అని స్పష్టం చేసింది. “కింగ్డమ్” సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం, విజయ్ దేవరకొండ కెరీర్లో కీలకమైన రిలీజ్‌గా నిలవనుంది.