ట్రైలర్ తో అంచనాలు పెంచిన ‘భద్రకాళి‘

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోని 25వ చిత్రం ‘శక్తి తిరుమగణ్’. ఈ చిత్రం తెలుగులో ‘భద్రకాళి‘ పేరుతో వస్తోంది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.;

By :  S D R
Update: 2025-09-10 07:52 GMT

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోని 25వ చిత్రం ‘శక్తి తిరుమగణ్’. ఈ చిత్రం తెలుగులో ‘భద్రకాళి‘ పేరుతో వస్తోంది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.

ట్రైలర్ విషయానికొస్తే.. ఈ చిత్రం ఆద్యంతం ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఒక సాధారణ వ్యక్తి మొత్తం రాజకీయాలను ఎలా కుదిపేశాడనే ఆసక్తికర అంశంతో ఎన్నికలు, డబ్బు, అధికారం, అవినీతి చుట్టూ ఓ సందేశాత్మక కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్ ఆంటోని గ్యాంగ్‌స్టర్‌గా, ప్రభుత్వ అధికారిగా విభిన్న షేడ్స్‌లో కనిపించాడు.

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ తో పాటు సర్వంత్ రామ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. విజయ్ ఆంటోని స్వయంగా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. మొత్తంగా.. ట్రైలర్ తో ‘భద్రకాళి‘పై అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.


Full View


Tags:    

Similar News