వరుణ్–లావణ్యకు పండంటి బాబు
మెగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డ పుట్టాడు.;
By : S D R
Update: 2025-09-10 09:24 GMT
మెగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సంతోషవార్త బయటకు రాగానే అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. ‘తాత అయిన నాగబాబు’ అంటూ జనసేన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ‘మిస్టర్’ సినిమాతో కలిసిన వరుణ్–లావణ్య జంట, 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.