'కె-ర్యాంప్‌' నుంచి ‘కలలే కలలే'

కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కె-ర్యాంప్‌’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు.;

By :  S D R
Update: 2025-09-10 02:15 GMT


కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కె-ర్యాంప్‌’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా రొమాంటిక్ మెలోడీ ‘కలలే కలలే’ లిరికల్ వీడియోను విడుదల చేశారు.

'కలలే కలలే కనులకు నువు కనబడి కలలే...' అంటూ భాస్కరభట్ల అందించిన చక్కటి సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ మ్యూజికల్ మేజిక్ జోడించాడు. గాయకుడు కపిల్ కపిలన్ తన స్వరంతో అద్భుతంగా ఈ పాటను పాడాడు. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమవుతుంది.


Full View


Tags:    

Similar News