'రాజా సాబ్’ ట్రైలర్ డేట్ కన్ఫర్మ్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.;
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల డిసెంబర్ నుంచి పొడిగించబడినా, ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ట్రైలర్, పాటలతో ప్రమోషన్స్ వేడెక్కనున్నాయి.
అక్టోబర్ 2న రిషబ్ శెట్టి ‘కాంతార – ఛాప్టర్ 1’ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అదే రోజు థియేటర్లలో ‘ది రాజా సాబ్’ ట్రైలర్ అటాచ్ చేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. అంటే, అక్టోబర్ 1న ట్రైలర్ డిజిటల్‌గా విడుదల అయ్యే అవకాశముంది.
ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 23) సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది. తమన్ అందించిన మ్యూజిక్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. టీజర్‌తోనే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ‘ది రాజా సాబ్’, ట్రైలర్, సాంగ్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.