నానీ ‘ప్యారడైజ్’ కోసం 30 ఎకరాల సెట్
ఆ కాలం రా అండ్ రస్టిక్ ఫీల్‌ని రీక్రియేట్ చేయడానికి, హైదరాబాద్ శివార్లలో దాదాపు 30 ఎకరాల్లో భారీ స్లమ్ సెట్స్ నిర్మిస్తున్నారు. నాని సినిమాకి ఇంత స్కేల్ అరుదైన విషయం, ఈ ప్రాజెక్ట్ ఎంత భారీగా ఉందో సూచిస్తోంది.;
నాచురల్ స్టార్ నాని తన కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రం "ప్యారడైస్"తో ముందుకు వస్తున్నాడు. "దసరా" ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుధాకర్ నిర్మాణంలో ఎస్‌ఎల్‌వీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది, నానిని పూర్తిగా కొత్త లుక్‌లో చూపించింది.
ఇప్పుడు షూటింగ్ షెడ్యూళ్లు ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. ప్రొడక్షన్‌కి సంబంధించిన తాజా అప్‌డేట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఈ కథ 1980ల నేపథ్యంలో సికింద్రాబాద్ బ్యాక్‌వాటర్స్‌లో సెట్ చేయబడిందని టాక్. ఆ కాలం రా అండ్ రస్టిక్ ఫీల్‌ని రీక్రియేట్ చేయడానికి, హైదరాబాద్ శివార్లలో దాదాపు 30 ఎకరాల్లో భారీ స్లమ్ సెట్స్ నిర్మిస్తున్నారు. నాని సినిమాకి ఇంత స్కేల్ అరుదైన విషయం, ఈ ప్రాజెక్ట్ ఎంత భారీగా ఉందో సూచిస్తోంది.
నాని డబుల్ రోల్‌లో కనిపించబోతున్నాడనే టాక్ కూడా ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది.ఇటీవల విడుదలైన నాని ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాంగ్ బ్రైడెడ్ హెయిర్, రగ్గడ్ స్టైలింగ్‌తో నాని బాయ్-నెక్స్ట్-డోర్ ఇమేజ్ నుండి పూర్తిగా భిన్నంగా కనిపించాడు. శ్రీకాంత్ ఓదెల నానిని ఇప్పటివరకూ చూడని రా షేడ్‌లో చూపించాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఫ్యాన్స్ నుండి ట్రేడ్ సర్కిల్స్ వరకూ అందరూ సూపర్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు, దీంతో "ప్యారడైస్" టాలీవుడ్‌లో మోస్ట్ టాక్డ్ అబౌట్ ప్రాజెక్ట్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేసింది. ఇది నాని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. తమిళ సంగీత సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎనిమిది భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాది మార్చి 26న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. "ప్యారడైస్" సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా నిలిచి, నాని స్టార్‌డమ్‌ని రీడిఫైన్ చేసే అవకాశం ఉంది.