ట్రెండింగ్‌లో సురేఖావాణి కూతురు

Update: 2025-03-15 10:38 GMT

సినీ నటి సురేఖావాణి కూతురు సుప్రీత, ఇటీవల తన ఓపెన్ స్టేట్‌మెంట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆమె, సామాజిక బాధ్యతను గుర్తించి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది.

పలువురి సెలబ్రిటీల మాదిరిగా సుప్రీత కూడా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసింది. అయితే, ఇటీవల పోలీసులు వీటి ప్రచారంపై చర్యలు తీసుకుంటుండటం, యాప్స్ వల్ల యువత నష్టపోతుండటంతో, ఆమె ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించింది. తెలిసో, తెలియకో ఇటువంటి యాప్స్‌కు ప్రచారం చేసినందుకు ఆమె క్షమాపణలు కోరింది.

ఒక్క క్షమాపణ చెప్పడమే కాకుండా, సుప్రీత భవిష్యత్తులో ఇటువంటి ప్రమోషన్లు చేయబోనని స్పష్టం చేసింది. యువతకు సందేశమిస్తూ, బెట్టింగ్ యాప్స్‌ను ఉపయోగించకూడదని, ఇప్పటికే ఉన్నవి వెంటనే డిలీట్ చేయాలని కోరింది. అంతేకాకుండా, ఈ యాప్స్‌ను సోషల్ మీడియాలో ఫాలో కాకూడదని హెచ్చరించింది.

Tags:    

Similar News