వినాయకచవితికి ‘సుందరకాండ‘

నారా వారబ్బాయి రోహిత్ ఇటీవల ‘భైరవం‘ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. మల్టీస్టారర్ గా రిలీజైన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.;

By :  S D R
Update: 2025-07-25 11:26 GMT

నారా వారబ్బాయి రోహిత్ ఇటీవల ‘భైరవం‘ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. మల్టీస్టారర్ గా రిలీజైన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఈ చిత్రంలో రోహిత్ క్యారెక్టర్ కి అప్లాజ్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా ‘సుందరకాండ‘ అంటూ మరో మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

గతంలోనే రాఘవేంద్రరావు, బాపు వంటి దిగ్దర్శకులు ఇదే టైటిల్ తో సినిమాలు చేశారు. ఇప్పుడు రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి ‘సుందరకాండ‘ చిత్రాన్ని తెరకెక్కించారు. 'నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్' అంటూ ఓ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ఇందులో విర్తీ వఘాని హీరోయిన్ గా నటించగా.. శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ‘సుందరకాండ‘ లేటెస్ట్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వినాయకచవితి కానుకగా ఆగస్టు 27న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ హీరో నారా రోహిత్, నరేష్, అభినవ్ గోమటం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.



Tags:    

Similar News