‘మేఘాలు చెప్పిన ప్రేమకథ‘ ట్రైలర్

పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పరిచే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ఒకటి.;

By :  S D R
Update: 2025-07-25 11:44 GMT

పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పరిచే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ఒకటి. నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటించిన ఈ చిత్రానికి విపిన్ దర్శకత్వం వహించారు. రాధిక శరత్ కుమార్, సుమన్, ఆమని, తులసి, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు.

లేటెస్ట్ గా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ‘ ట్రైలర్ రిలీజయ్యింది. ప్రేమ, ఫ్యామిలీ, మ్యూజిక్, గోల్ వంటి ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సునేత్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 22న ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Full View


Tags:    

Similar News